తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పలు అనుమానాలున్నాయి. ఆమె డెత్ మిస్టరీ వీడాలని.. నిజాలు మరణించకూడదంటూ సినీ నటి గౌతమి ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల లేఖ రాశారు. ఈ లేఖతో అన్నాడీఎంకే కార్యకర్తలు, నటుడు శరత్ కుమార్‌ల నుంచి బెదిరింపులు, విమర్శలు ఎదుర్కొన్నారు. గౌతమి అమ్ముడుపోయారని ఇలాంటి లేఖలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నటి రాధిక భర్త, నడిగర్ సంఘం మాజీ అధ్యక్షుడు, ఏడీఎంకే నేత శరత్ కుమార్ విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో గౌతమి తొలి లేఖకు ప్రధాని నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రెండోసారిగా రిమైండింగ్ లెటర్‌ను గౌతమి రాశారు. అందులో జయలలితకు అందించిన చికిత్సలు, ఆమె మృతి పట్ల గల అనుమానాలు ప్రజలకు తెలియాలన్నారు. 75 రోజుల పాటు అమ్మకు ఇచ్చిన చికిత్స పట్ల అపోలో ఇచ్చిన వివరాలను స్వాగతిస్తున్నా. అయితే తొలి లేఖలో తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం లభించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.