కురచ దుస్తులు వేసుకుని రాత్రిపూట తిరగొద్దు : కేంద్ర మంత్రి హితవు

సోమవారం, 29 ఆగస్టు 2016 (09:39 IST)
కురచ దుస్తులు ధరించవద్దని, రాత్రిసమయంలో ఒంటరిగా తిరగొద్దని భారత్‌కు వచ్చే పర్యాటకులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. విదేశీ పర్యాటకులు గైడ్‌ను వెంటబెట్టుకుని పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లాలని ఆయన కోరారు. 
 
అలాగే, విమానాశ్రయంలో దిగగానే పర్యాటకులకు వెల్కం కిట్ అందజేస్తాం. పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కార్డు కూడా ఇందులోవుంటుంది. చిన్న పట్టణాల్లో రాత్రిసమయంలో ఒంటరిగా తిరగొద్దు. కురచ దుస్తులు ధరించొద్దు. మీరు వినియోగించే కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఫొటో తీసి మీ స్నేహితులకు పంపాలనే జాగ్రత్తలు ఇందులో రాసివుంటాయని మహేశ్ శర్మ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి