జోషిమఠ్‌ భూమి క్షీణించింది... కేవలం 12 రోజుల్లోనే 5.4 సెం.మీటర్లు?

శనివారం, 14 జనవరి 2023 (20:58 IST)
Joshimath sank
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో కేవలం 12 రోజుల్లోనే 5.4 సెంటీమీటర్లు వేగంగా తరిగింపోయిందని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నివేదిక వెల్లడించింది. అయితే ఇస్రో వెల్లడించిన ఒక్కరోజులోనే జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రభుత్వ సంస్థలను మీడియాతో ఈ విషయాన్ని పంచుకోకుండా దాటవేసింది. జోషిమఠ్‌కు సంబంధించిన డేటా సోషల్ మీడియాలో షేరైతే వారివారి అభిప్రాయాల కారణంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొంది.
 
జోషిమఠ్‌లో భూమి క్షీణతను అంచనా వేయడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఇస్రోతో సహా అనేక సంస్థలను ఈ విషయంపై తమ సంస్థకు అవగాహన కల్పించాలని తుది నివేదిక వచ్చే వరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దీనిపై పోస్టులు వుండకూడదని పేర్కొంది.
 
కార్టోశాట్-2ఎస్ ఉపగ్రహం, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ద్వారా  డిసెంబర్ 27 నుంచి జనవరి 8 తేదీల మధ్య జోషిమఠ్ 5.4 సెం.మీటర్ల భూమి క్షీణత కలిగింది. ఈ వ్యత్యాసాన్ని ఈ ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు