మానవత్వం మంటగలిసిపోయింది.. ట్రక్ డ్రైవర్ గాయపడితే.. ఫోన్, డబ్బు దొంగలించేశారు.. (video)

సెల్వి

శనివారం, 4 జనవరి 2025 (13:36 IST)
Truck Driver
మానవత్వం మంటగలిసిపోయిందనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ట్రక్ ప్రమాదానికి గురైంది. ట్రక్కు డ్రైవర్ సీటులోనే ఇరుక్కుపోయాడు. అయితే అతనిని కాపాడాల్సిన మనుషులు.. ఆయన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ట్రక్కులో వుండిన డబ్బు, సెల్ ఫోన్‌ను దోచుకున్నారు.
 
కాపాడండి అంటూ ఆ ట్రక్కు డ్రైవర్ ఎంత వేడుకున్నా.. ట్రక్కులో వుండే వస్తువులపైనే అక్కడున్న వ్యక్తుల దృష్టి పడింది. ఈ క్రమంలోనే ట్రక్కులో కనిపించిన స్మార్ట్ ఫోన్, డబ్బును ఎత్తుకెళ్లారు. 
 
ఇదంతా చూసిన ఆ డ్రైవర్ వేరేం మనుషులంటూ చూస్తుండిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

After the accident in India, the injured driver was stuck in his seat. Instead of helping him, some people started looting his mobile phone, money, and other belongings.https://t.co/YzQ7jBpGst

— Rheahaha Commentary (@Rheahaha123) January 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు