అదేసమయంలో నాలుగేళ్ళ పాటు సైన్యంలో సేవలు అందించేందుకు దేశ యువత అమిత ఉత్సాహం చూపుతోంది. ఇందులోభాగంగా, ఈ అగ్నిపథ్ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి మూడు రోజుల్లోనే ఏకంగా 59960 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల ఐదో తేదీతో ముగియనుంది.
అప్పటికి లక్ష దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను డిసెంబరు 11వ తేదీన ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యేడాది మాత్రం 23 యేళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. agnipathvayu.cdac.in అనే వెబ్సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.