ఓ ప్రైవేట్ విమానయాన సంస్థలో పని చేసే ఎయిర్‌హోస్టెస్ తెల్లారేసరికి నడి రోడ్డుపై సెమీ న్యూడ్ దుస్తుల్లో మృతదేహమై కనిపించింది. తన ఫ్లాట్‌లో రాత్రంతా పార్టీ ఇచ్చిన ఈమెను ఎవరైనా హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అనే అంశం మాత్రం సస్సెన్స్‌గా ఉంది. కోల్‌కతా నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
ఈ ఇంటిని కూడా షిల్లాంగ్‌కు చెందిన క్లారా తండ్రి ఇటీవలే ఆమెకు కోల్‌కతాలో ఒక ఫ్లాట్ కొనిచ్చాడు. ఈ ఫ్లాట్‌లోనే ఆమె ఉంటోంది. ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె.. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులకు ఘనంగా పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, తెల్లవారుజామున పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసుకులకు క్లారా మృతదేహం రోడ్డుపై కనిపించింది. అదీ కూడా సెమీ న్యూడ్‌గా కనిపించింది.
ఈ వివరాలు సేకరించిన పోలీసులు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఇద్దరు యువకులను అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. క్లారాను హత్యచేసి, శవాన్ని కిటికీలో నుంచి బయటకు తోసేసి ఉంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.