ఫేస్‌బుక్ పుణ్యమాని రైతుపంట పండింది... ఎలా?

ఆదివారం, 24 మార్చి 2019 (12:06 IST)
ఖండాంతరాల్లో ఉండేవారిని కూడా దగ్గరకు చేరదీసే ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియా ఒకటి. వీటిలో ఫేస్‌బుక్ ఒకటి. దీని పుణ్యమాని అనేక మంది యువతీయువకులు ఒక్కటవుతున్నారు. మరికొందరు మోసపోతున్నారు. తాజాగా ఫేస్‌బుక్ పుణ్యమాన్ని ఓ రైతుపంటపండింది. ఏకంగా అమెరికా అధికారిణి ఓ రైతును వివాహం చేసుకుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం, హోషంగాబాద్‌లోని శివ్నీమాల్వాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బోసోనీ గ్రామానికి చెందిన దీపక్ రాజ్‌పూత్‌ను అమెరికాకు చెందిన జెలీ లిజోథ్ మనువాడింది. ఫేస్‌బుక్‌లో మొదలైన వీరి పరిచయం వివాహానికి దారితీసింది. ఈ క్రమంలో రంగుల వేడుక హోలీ పండుగ రోజున వీళ్లిద్దరు ఒక్కటయ్యారు. 
 
జోలీ‌‌లిజోథ్ అమెరికాలోని సౌత్ అమెరికాలోని ఆవ్లీటాస్ బొలీవియాలో ఉంటున్న లిజోథ్ అక్కడ మానవవనరుల శాఖలో అధికారిణిగా పనిచేస్తున్నారు. దీపక్ రాజ్‌పూత్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన లిజోథ్‌ మధ్య ఆరు నెలలుగా వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు. తర్వాత రెండు నెలల క్రితం లిజోథ్ భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరు కలుసుకుని హోలీ పండుగ రోజు.. నర్మదానది ఒడ్డున ఉన్న చిత్రగుప్త మందిరంలో వివాహం చేసుకున్నారు. 
 
అనంతరం హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత దేశంలో ఉండే రైతులను వివాహం చేసుకోవటానికి యువతులు ముందుకురాని తరుణంలో ఏకంగా అమెరికాలో ప్రభుత్వం అధికారిణిగా పనిచేస్తున్న యువతి మన దేశపు రైతన్నను వివాహం చేసుకోవటం ఓ విశేషమైతే.. వారిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు