కరిగిపోయిన పెచ్చులు ఊడుతున్న సున్నపు పూతను తొలగించి, సాంప్రదాయికంగా వాడే సున్నపు పూత ప్రక్రియను మొదలెట్టామని, పాత, కొత్త గదులకు సంబంధించిన ఫొటో గ్రాఫులను పురావస్తు శాఖ న్యూస్ లెటర్‌లో కూడా ప్రచురించామని తెలిపింది.
తాజ్‌మహల్ భూగర్భ గదుల్లో విగ్రహాల్లాంటివి ఏమీ లేవని భారత పురావస్తు శాఖ పేర్కొంది. ఆ గదుల్లో ఎలాంటి రహస్యాలూ లేవని, తాజ్‌మహల్ కట్టడంలో అవి ఒక భాగం మాత్రమేనని, వాటికి పెద్దగా ప్రత్యేకత ఏమీ లేదని తెలిపింది.