ఎంబీఏ విద్యార్థిని వినూత్న ప్రచారం.. నృత్యరూపంలో హెల్మెట్స్ ధరించాలంటూ..

మంగళవారం, 19 నవంబరు 2019 (09:54 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ ఎంబీఏ విద్యార్థిని చేస్తున్న వినూత్న ప్రచారం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు, శిరస్త్రాణాం ధరించాలంటూ నృత్యరూపంలో ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విద్యార్థిని గురించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఆ ఎంబీఏ విద్యార్థిని పేరు షుబీ జైన్. ఇండోర్ నగరంలోని రోడ్లపై వాహనదారులకు జాగ్రత్తలు చెబుతూ వారిని సురక్షితంగా ఉండాలని హితబోధ చేస్తుంది. షుబీ జైన్ చెప్పే విధానం ఓ సంగీత నృత్యరూపకం తరహాలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 
తన ప్రచార కార్యక్రమానికి కాస్తంత డ్యాన్స్ కూడా జోడించి షుబీ చేస్తున్న విజ్ఞప్తులకు వాహనదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా హెల్మెట్లు ధరించాలన్నది ఆమె చేపట్టిన కార్యక్రమం సారాంశం! ఆసక్తికర అంశం ఏమిటంటే, ఆమె నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ స్ఫూర్తి పొందాడో ఏమో కానీ ఆయన కూడా డ్యాన్స్ మూమెంట్స్‌తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇస్తూ దర్శనమిచ్చాడు.

 

#WATCH Madhya Pradesh: An MBA student Shubi Jain volunteering to manage traffic on roads in Indore in her unique way, to spread awareness about traffic norms & regulations. pic.twitter.com/hBZd0bt3C5

— ANI (@ANI) November 18, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు