ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంజు అనే వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలు, కుటుంబాన్ని వదిలివేసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. అక్కడ తన ఫేస్‌బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తుంది. కానీ, భారత్‌లోని ఆమె మొదటి భర్త, ఇతర కుటుంబ సభ్యులకు మాత్రం కష్టాలు ప్రారంభమయ్యాయి.
జాతీయ మీడియా కథనాల మేరకు... అంజు భర్త ఆయన పని చేస్తున్న సంస్థ ఉద్యోగంలో ఉంచినప్పటికీ ఎలాంటి పనులు కేటాయించకుండా బెంచ్‌కే పరిమితం చేస్తుంది. అలాగే ఆమె సోదరుడిని మాత్రం ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక అంజు తండ్రి టైలర్‌గా జీవనం సాగిస్తున్నారు. ఇపుడు ఆయన వద్దకు చుట్టుపక్కలవారు ఎవరూ రావడం లేదు. ఎవరూ పని ఇవ్వడం లేదు. దీంతో ఆయన జీవనాధారాన్ని కోల్పోయారు.
నిజానికి అంజు పాకిస్థాన్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె తండ్రిపై గ్రామస్తులు సానుభూతి చూపించారు. కానీ, ఎపుడైతే పాకిస్థాన్ ప్రియుడిని రెండో పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి భారత్‌లోని ఆమె కుటుంబ సభ్యలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా పాకిస్థాన్ వెళ్ళి, అక్కడ పెళ్ళి చేసుకుని స్థిరపడటంతో ఆమె కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి.
మరోవైపు, వివాహం తర్వాత అంజు తన పేరును ఫాతిమాగా పేరు మార్చుకున్నారు. పైగా, ఆమెకు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ యజమానీ భారీగా నగదుతో పాటు స్థలం కూడా ఇచ్చారు. ప్రస్తుతం అంజు తన పాక్ భర్తతో కలిసి ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్, అప్పర్ దిర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్నారు.