సోనూ సూద్‌ మరో ఉదారత.. 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం

మంగళవారం, 14 జులై 2020 (09:41 IST)
రియల్ హీరో సినీనటుడు సోనూ సూద్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. లాక్‌డౌన్‌ సంక్షోభంతో వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.

సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని తాజాగా ప్రకటించారు. తాజాగా, లాక్ డౌన్ సమయంలో మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలనుకున్నాననీ, అది తన బాధ్యతగా భావిస్తునని సోనూసూద్ ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు.

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూసూద్‌ చూపిన చొరవ, కృషి పలువురి ప్రశంలందుకుంది. వారికోసం బస్సుల దగ్గర నుంచి చార్టర్డ్‌ విమానాల వరకు అన్నిరకాల ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు