తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితన 75 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకుని చికిత్స అందించిన అపోలో బాగాను గుంజుకుందని వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియా అపోలోపై సెటైర్లు, విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అమ్మకు చికిత్స అందించేందుకు అపోలో ఏకంగా రూ.80కోట్లు తీసుకుందని తెలిసింది.
ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో ఇప్పటికే రూ.6 కోట్లు చెల్లించింది. ప్రజా ప్రతినిధులు అనారోగ్యానికి గురైనపుడు వైద్య ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. జయ వైద్యానికి అయిన ఖర్చులను కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తరువాత జయ ఉన్న రెండో అంతస్తు మొత్తం ఖాళీ చేయించారు. దీంతో ఆ అంతస్తులోని 30 గదుల అద్దెను రాష్ట్ర సర్కారే చెల్లించాల్సి వుంటుంది.