నా ఫ్లాట్లలో రూ. 49.8 కోట్లా, అవి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు: అర్పితా ముఖర్జీ

మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:53 IST)
బడా వ్యక్తులు కుంభకోణాలను చూస్తే కళ్లు తిరిగిపోతుంటాయి. కోట్ల రూపాయలు వెనకేసేస్తారు. బెంగాల్ మాజీమంత్రి పార్థ ఛటర్జీ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ కుంభకోణంలోనూ ఇలాంటి సంచలన విషయాలే బయటపడుతున్నాయి. కోల్‌కతాలోని తన ఫ్లాట్లలో స్వాధీనం చేసుకున్న నగదు తనది కాదని అరెస్టైన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ పేర్కొన్నారు.

 
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణలో ఆమె ఈ మేరకు వెల్లడించారు. టోలీగంజ్, బెల్ఘరియాలోని తన రెండు ఫ్లాట్లలో స్వాధీనం చేసుకున్న రూ. 49.8 కోట్ల నగదు ఎలా వచ్చిందో తనకు తెలియదని విస్మయం వ్యక్తం చేసింది. అంతేకాదు... ఆ డబ్బును తను లేని సమయంలో పెట్టి వుంటారనీ, దాని గురించి తనకు తెలియదని ముఖర్జీ చెప్పినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ పేర్కొంది.

 
గత నెల, కోల్‌కతాలో జరిగిన దాడుల తర్వాత SSC రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి బెంగాల్ మాజీ మంత్రితో పాటు అర్పితా ముఖర్జీని అరెస్టు చేశారు. ఈడీ సోదాల్లో కోట్ల విలువైన నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు