ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అత్యవసర వైద్య పరికరాలు, మందులు, మందుల తయారీకి అవసరమైన సామగ్రిని తగిన స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు మోదీ ఈ సందర్భంగా సూచించారు. రాబోయే కొన్ని వారాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటీన్‌ల పైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోంది. కానీ, దానర్థం వీధుల్లో స్వేచ్ఛగా తిరగొచ్చని కాదని.. వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సామాజిక దూరం పాటించడం, లాక్‌డౌన్ మాత్రమే కోవిడ్-19ను ఎదుర్కొనే మార్గమని ట్వీట్‌లో పేర్కొన్నారు.