ఓట్ల లెక్కింపునకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారో తెలుసా?

మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (10:08 IST)
ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీ ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజా ట్రెండ్ మేరకు సంపూర్ణ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ట్రెండ్ మేరకు ఆప్ 50, బీజేపీ 20 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. ఈ ట్రెండ్స్ సరళి మేరకు ఆప్ అధికారం దక్కించుకోవడం ఖాయమని తేలిపోయింది. 
 
అయితే, ఈ ఓట్ల లెక్కింపునకు ముందు అరవింద్ కేజ్రీవాల్ ఎం చేశారో తెలుసుకుందాం. ఈనెల ఎనిమిదో తేదీన ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని కేజ్రీవాల్ గట్టినమ్మకంతో చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు చేపట్టారు. అయితే, ఈ ఓట్ల లెక్కింపునకు ముందు ఆయన ఉదయాన్ని నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, గుడికి వెళ్లి వచ్చి, తన ఇంట్లో టీవీ ముందు ప్రశాంతంగా కూర్చొన్నారు. 
 
అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రధాన నేతలంతా తమ పిల్లలు, భార్యలతో కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఫలితాలు వెల్లడికాగానే, దీపావళి పండగను మరోసారి జరుపుకునేందుకు వారంతా సిద్ధమయ్యారు.
 
అదేవిధంగా, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తన ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేయగా, బీజేపీ నేత విజయ్ గోయల్ కన్నాట్ ప్లేస్‌లో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు