అనారోగ్యం బారినపడి చనిపోయిన ప్రేమికురాలిని ఓ ప్రేమికుడు వివాహం చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన అస్సోం రాష్ట్రంలోని మోరిగావ్ జిల్లాలో జరిగింది. పైగా, ఇక జీవితంలో పెళ్లి కూడా చేసుకోనని శపథం కూడా చేశాడు. అతనిది నిజమైన ప్రేమ అంటూ నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, మోరిగావ్‌కు చెందిన బిటుపన్ తములి అనే యువకుు కౌసువ గ్రామానికి చెందిన 24 యేళ్ల ప్రాథనా బోరా అనే యువతిని ప్రేమించాడు. అయితే, ఇటీవల అనారోగ్యానికి గురైన ప్రాథనా బోరా కన్నుమూసింది. తన ప్రియురాలి మరణాన్ని బిటుపన్ జీర్ణించుకోలేక పోయాడు. అచేతనంగా ఉన్న ప్రియురాలి శవాన్ని చూసి బోరున విలపించాడు.
చివరకు అక్కడే అందరి ముదు మృతదేహానికి తాళికట్టి పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత తన జీవితంలో మరెవరినీ పెళ్లి చేసుకోనని ప్రమాణం చేశాడు. ఇది చూసిన స్థానికులు బిటుపన్‌ది స్వచ్ఛమైన, నిజమైన ప్రేమ అంటూ ప్రశంసలు కురిపించారు. పైగా, ప్రియురాలి అంత్యక్రియలను కూడా భర్త హోదాలో జరిపించాడు.