ఇప్పుడు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ తను తీయబోయే చిత్రానికి 'ది వాక్సిన్ వార్' టైటిల్ ని ఖరారు చేశారు. 'ది వాక్సిన్ వార్' చిత్రం దేశంలో కోవిడ్ మహమ్మారి, టీకా కోసం జరిగిన కసరత్తులకు సంబధించిన అంశాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారని టైటిల్, పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. పోస్టర్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ను కలిగి ఉన్న వీల్‌ను చూడవచ్చు. అలాగే “మీకు తెలియని యుద్ధంలో మీరు పోరాడి గెలిచారు'' అనే సందేశం కూడా కనిపోస్తోంది.
భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 11 భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ది వ్యాక్సిన్ వార్ నిర్మిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా 11 భాషలలో 'ది వాక్సిన్ వార్'ని విడుదల చేయనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.