48 గంటల్లో 42 మంది చిన్నారుల మృతి... గోరఖ్‌పూర్‌లో దారుణం

బుధవారం, 30 ఆగస్టు 2017 (12:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మరణమృదంగ ఘోష ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గడచిన 48 గంటల్లో 42 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చిన్నారుల మృతిపై బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పీకే సింగ్ స్పందించారు. 42 మంది చిన్నారుల్లో.. ఏడుగురు మెదడువాపు వ్యాధితో, మరో 35 మంది చిన్నారులు ఇతర కారణాలతో మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు.
 
ఆగస్టు 27వ తేదీన చిన్నపిల్లల విభాగంలో 342 మంది చిన్నారులు చికిత్స కోసం చేరారు. అందులో 17 మంది మృతి చెందారు. ఆగస్టు 28న 344 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా 25 మంది చిన్నారులు మృతి చెందినట్లు పీకే సింగ్ తెలిపారు. ఆగస్టు 7 నుంచి 11వ తేదీ మధ్యలో ఆక్సిజన్ అందక 60 మంది చిన్నారులు మృతి చెందిన విషయం విదితమే. 
 
కాగా, చిన్నారుల మృతి కేసుకు సంబంధించి.. బీఆర్డీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమ శుక్లాను పోలీసులు కాన్పూర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 
 
 

42 children died in 48 hours of which 7 due to #encephalitis ,rest due to other reasons:PK Singh,Principal BRD Medical College #Gorakhpur pic.twitter.com/55iPImxMjC

— ANI UP (@ANINewsUP) August 30, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు