ఆపరేషన్ థియేటర్‌లో తన్నుకున్న వైద్యులు.. బిడ్డ మృతి... ఎక్కడ? (Video)

బుధవారం, 30 ఆగస్టు 2017 (11:24 IST)
ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు ఘర్షణపడ్డారు. అంతేనా.. ఈ గొడవలు శృతిమించడంతో తన్నుకున్నారు. వీరితన్నులాటకు నవజాతశిశువు కన్నుమూసింది. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ ఆస్పత్రిలో వైద్యులు రాక్షసుల్లా ప్రవర్తించారు. గర్భిణికి శస్త్రచికిత్స చేస్తూ.. ఇద్దరు వైద్యులు గొడవపడ్డారు. ఈ క్రమంలో తల్లీ శిశువు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్‌లో గొడవ పడిన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

 

Pregnant woman loses her newborn while #doctors engage in verbal spat during delivery. Ummed hospital, Jodhpur, #Rajasthan @dna @jaipurdna pic.twitter.com/2oJ5nBe9Qs

— amit bhatt (@bhattamith) August 30, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు