అటల్‌ జీకి ఆంధ్రా రొయ్యలంటే అమితమైన ఇష్టం... శునకాలంటే ప్రాణం

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (10:57 IST)
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టుకతో బ్రాహ్మణుడే. కానీ మాంసాహారి కూడా. ఆయనకు ఆంధ్రా రొయ్యలంటే అమితమైన ఇష్టం. అందుకే ఆయన భోజన మెనూలో ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారైనా రొయ్యల వేపుడు ఉండాల్సిందే. ఈ విషయం తెలుసుకున్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు నెల్లూరు నుంచి ప్రత్యేకంగా రొయ్యలు తీసుకుని వెళ్లి వాజ్‌పేయి వంట మనిషికి ఇచ్చేవారట. అలాగే, ఆయనకు చేపల పులుసు అన్న కూడా మహాయిష్టం.
 
అలాగే, వాజ్‌పేయికి పెంపుడు జంతువులంటే ప్రాణం. ప్రధానిగా ఉన్న రోజుల్లో ఆయన నివాసంలో సస్సీ, సోఫీ అనే కుక్కలు.. రితూ అనే పిల్లి ఉండేవి! వాజ్‌పేయి ఇంట్లో ఉంటే ఈ మూడు ఆయన ఎదురుగానే తచ్చాడేవి. వాటిని ఆయన ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నిమిరేవారు. ఆయన మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నప్పుడూ ఆ కుక్కలు ఆయన వెంటే ఉండేవి. తీరిక దొరికితే.. ఆ శునకాలను ఆయన చాలా దూరం నడిపించుకుంటూ తీసుకువెళ్లేవారు. వాటితో ఆడుకునేవారు. 
 
అటల్ జీ అభిరుచుల్లో కొన్ని... 
ఇష్టమైన వస్త్రధారణ: ధోవతి, కుర్తా. అప్పుడప్పుడు పఠానీ సూట్‌
ఇష్టమైన రంగు: నీలం
ఇష్టమైన ప్రదేశం: మనాలి, అల్మోరా, మౌంట్‌ అబూ
ఇష్టమైన ఆహారం: రొయ్యలు, చేపలు,
ఇష్టమైన సంగీత వాద్యకారులు: భీంసేన్‌ జోషి(గాయకుడు), అమ్జద్‌ అలీ ఖాన్‌ (సరోద్‌) హరిప్రసాద్‌ చౌరాసియా (వేణుగానం)
ఇష్టమైన గాయకులు: లతా మంగేష్కర్‌, ముఖేశ్‌, మహమ్మద్‌ రఫీ
ఇష్టమైన ఆటలు: హాకీ, ఫుట్‌బాల్‌
సన్నిహితులు: ఎల్‌కే అద్వానీ, బైరాన్‌ సింగ్‌ షెకావత్‌, ఎన్‌.ఎం గటాటే, జశ్వంత్‌ సింగ్‌, డాక్టర్‌ ముకుంద్‌ మోడీ
జీవిత పరమార్థం: జీవితాన్ని నిజాయితీగా గడపడం. భారతదేశాన్ని ప్రపంచదేశాల్లో మకుటాయమానం చేసేందుకు కృషి చేయడం
బాధాకరమైన క్షణం: తండ్రిని కోల్పోయినప్పుడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు