అయోధ్య కేసులో ట్విస్ట్ : విచారణ నుంచి వైదొలగిన ధర్మాసన జడ్జి

గురువారం, 10 జనవరి 2019 (12:08 IST)
అయోధ్య కేసులో సరికొత్త ట్విస్ట్. అయోధ్య భూమి కేసు విచారణ నుంచి ధర్మాసనంలోని జడ్జి ఒకరు తప్పుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. అలాగే, ఈ భూవివాద కేసును విచారించేందుకు సరికొత్త రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటుచేయనుంది. 
 
ఆరు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ భూవివాద కేసును విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటైన విషయం తెల్సిందే. ఇందులో చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్‌, జస్టిస్ లలిత్‌లతో పాటు న్యాయమూర్తులు ఎస్ఏ బోదే, ఎన్వీ రమణ, డీవై చంద్రసూడ్‌లు సభ్యులుగా ఉన్నారు. 
 
అయితే, ఈ ధర్మాసనంలో జస్టిస్ లలిత్‌ ఉండటాన్ని సీనియర్ న్యాయవాది ఒకరు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ ధర్మాసనం నుంచి లలిత్ తప్పుకున్నారు. గతంలో ఇదే కేసులో మరొకరి తరపున లలిత్ న్యాయవాదిగా వాదనలు వినిపించడంతో ఇపుడు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా కేసును ఈనెల 29వ తేదీకి వాయిదా వేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు