అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

ఠాగూర్

శనివారం, 12 ఏప్రియల్ 2025 (10:13 IST)
కోట్లాది మంది హిందువులకు పరమపవిత్రమైన ప్రదేశంగా అయోధ్య నగరం విరాజిల్లుతుంది. అలాంటి అయోధ్య నగరంలో ఉండే ఓ అతిథి గృహంలోని బాత్రూమ్‌లో ఓ మహిళ స్నానం చేస్తుంటే ఓ వ్యక్తి మొబైల్ ఫోనులో వీడియోను చిత్రీకరించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసికి చెందిన 30 యేళ్ల రామ మందిరాన్ని సందర్శించేందుకు మరికొందరితో కలిసి ఓ వ్యక్తి అయోధ్య నగరానికి వచ్చారు. వారంతా మందిరానికి సమీపంలో ఉన్న ఓ అతిథి గృహంలో గదులను అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో  ఆమె స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లింది. ఇంతలో ఎవరో తనను వీడియో తీస్తున్నట్టుగా గమనించి కేకలు వేసింది. దీంతో వెంటనే అక్కడున్న యాత్రికులతో పాటు గెస్ట్ హౌస్ సిబ్బంది అక్కడకు చేరుకుని వీడియో తీసిన నిందితుడుని పట్టుకున్నారు. 
 
అతన్ని సౌరభ్ తివారీగా గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అతడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడు యూపీలోని బహ్రైచ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ అతిథి గృహంలోనే సౌరభ్ పని చేస్తున్నట్టు తేలింది. ఈ క్రమంలో అతడి ఫోనును పరిశీలించగా అందులో చాలా మంది మహిళల వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు