అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి పునాది పనులు పూర్తి అవుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తన ట్విట్టర్‌లో వెల్లడించింది. అయితే ఆలయానికి సంబంధించిన గ్రౌండర్ ఫ్లోర్ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల లోపే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
ఆలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఇంజినీర్లు, కార్మికులు అంతా ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నట్లు ట్రస్టు పేర్కొన్నది. ప్రతి రోజు రెండు ఫిఫ్ట్‌లుగా పనులు జరుగుతున్నట్లు ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.