పతంజలి పేరుతో ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లోకి దించిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్.. ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఫక్తు వ్యాపారిగా మారిపోయారు. ఇప్పటివరకు ఆయన 800 రకాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. వీటిలో పేస్ట్, కారం పొడులు, మందులు ఇత్యాది సరుకులు ఉన్నాయి. తాజాగా దుస్తుల వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు.
గతంలో తనకు ఎదురైన ఈ ఘటనని ఇండోర్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో గుర్తుచేసుకున్నారు. ''తొలిసారి నేను అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అందుకు అమెరికా అధికారులు నిరాకరించారు. అందుకు కారణం అడిగితే బ్రహ్మచారి కావడం, బ్యాంకు ఖాతా లేకపోవడం వల్ల వీసా ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
ఈ రెండూ కాకుండా వేరే కారణం ఏదైనా ఉందా అని అడిగినప్పుడు బాబాజీ… ఇప్పట్లో వీసా ఇవ్వలేమం అని తేల్చిచెప్పారు'' అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అమెరికానే తనను స్వయంగా ఆహ్వానించి… పదేళ్ల పాటు అమలులో ఉండే వీసా ఇచ్చిందని, కొరకుండానే పదేళ్ల వీసా అందించారని చెప్పుకొచ్చారు రాందేవ్ బాబా.