ప్రియుడితో కలిసి పీకల వరకు మద్యం సేవించిన ఓ యువతి పోలీసు స్టేషన్లో ప్రియుడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులు పెట్టింది. పోలీసులు వారిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా తనపనిని పూర్తి చేసింది. ఇకలాభం లేదని భావించిన పోలీసులు.. ఆ యువతిపై కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు పంపించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే...
బెంగళూరుకు చెందిన అర్చన అనే యువతి తమిళనాడులోని తుత్తిపట్టులోని కామరాజనగర్‌కు చెందిన వివేకానంద్ అనే యువకుడిని ప్రేమించింది. ఇటివల వేలూరుకు వచ్చిన ఈ ప్రేమ జంట పీకల వరకు మద్యం సేవించింది. ఆతర్వాత బైక్ రైడింగ్‌కు బయలుదేరింది. వివేకానంద్ బైక్‌ను అడ్డదిడ్డంగా నడుపుతుంటే వెనుకే కూర్చున్న అర్చన ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగింది. ఈ క్రమంలో వారి బైకు ఓ కారును రాసుకుపోయింది.
అక్కడ తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ యువతి వీరంగమాడింది. అక్కడికక్కడే వివేకానంద్‌ను కౌగించుకుని ముద్దులాట మొదలెట్టింది. ఇలాగైతే కుదరదని భావించిన పోలీసులు వివేకానంద్‌పై ర్యాష్ డ్రైవింగ్ కేసు పెట్టి అతడిని పంపించివేసి అర్చనను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత జడ్జి ఆదేశాల మేరకు ఆమెను సెంట్రల్ జైలుకు తరలించారు.