ఆయనకు ఇచ్చిన మాట కోసం కడప దర్గాకు రామ్ చరణ్

ఠాగూర్

సోమవారం, 18 నవంబరు 2024 (18:45 IST)
ఏఆర్ రెహ్మాన్‌కు ఇచ్చిన మాట కోసం హీరో రామ్ చరణ్ సోమవారం కడప పెద్ద దర్గాకు వెళ్లారు. సోమవారం ఈ దర్గా 80వ వార్షిక వేడుకలు జరుగుతన్నాయి. ఇందులో రామ్ చరణ్‌తో పాటు యువ దర్శకుడు బుచ్చిబాబు కూడా పాల్గొంటున్నారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి కడపకు విమానంలో వెళ్ళారు. సాధారణంగా ప్రతియేటా కడప పెద్ద దర్గా పిలిచే అమీన్ పూర్ దర్గాకు ఏఆర్ రెహ్మాన్ క్రమం తప్పకుండా వెళుతుంటారు. 
 
'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రంతో ఆస్కార్ గెలుచుకున్న తర్వాత రెహ్మాన్ నేరుగా ఈ దర్గాను సందర్శించిన విషయం తెల్సిందే. అయితే ఈ ఏడాది కడప దర్గా ఒక ప్రత్యేక సందర్భానికి వేదికగా మారనుంది. 80వ ముషాయిరా గజల్ ఈవెంట్‌లో ఏఆర్ రెహ్మాన్ ప్రదర్శన ఇవ్వనున్నారని, దీనికి ప్రత్యేకంగా రామ్ చరణ్‌ను రెహ్మాన్ స్వయంగా ఆహ్వానించగా, తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చినట్టు సమాచారం. ఇందుకోసమే రామ్ చరణ్ కడపకు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. కాగా, రామ్ చరణ్ నటించే 16వ చిత్రానికి రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్, ఏఆర్ రెహ్మాన్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కడప దర్గాకు వెళ్లారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు