బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చే సెలవులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూడు క్యాటగిరీలుగా విడదీసింది. హాలీడే అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే , బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ పేరిట విభజించింది.
ఆగస్టులో వచ్చే పలు పర్వదినాలు.. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ పరిధిలోకి వస్తున్నాయి. దీంతో ఆయా పండుగలకు సెలవులు వచ్చేశాయి. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో అన్ని బ్యాంకింగ్ కంపెనీలు బ్యాంక్ హాలీడేలు పాటించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో పండుగలు, లేదా ప్రభుత్వాల నోటిఫికేషన్లను బట్టి బ్యాంకులకు సెలవులు ఇస్తారు.
ఆదివారంతోనే ఆగస్టు నెల మొదలవుతుంది. కనుక ఒకటో తేదీన బ్యాంకులు మూసి ఉంటాయి. దీంతోపాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలతో కలిపి మొత్తం ఎనిమిది సెలవులు వస్తాయి. ఆగస్టు 15 కూడా ఆదివారం.. స్వాతంత్ర్య దినోత్సవం..
పార్శీ నూతన సంవత్సరాది సందర్భంగా ఆగస్టు 16న బెలాపూర్, ముంబై, నాగ్‌పూర్ వాసులు సంబురాలు చేసుకుంటారు. 19న మొహరం సందర్భంగా అగర్తల, అహ్మదాబాద్, బెలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్‌లలో బ్యాంకులు పనిచేయవు.
ఆగస్టు 14- రెండో శనివారం
ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం, ఆదివారం
ఆగస్టు 16- పార్శీ నూతన సంవత్సరాది