మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

ఠాగూర్

ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (18:11 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఆర్థిక కష్టాలు పేరుతో భర్తకు మాయమాటలు చెప్పిన భార్య.. కట్టుకున్నోడి కిడ్నీని విక్రయించింది. తద్వారా వచ్చిన డబ్బుతో తన ప్రియుడుతో కలిసి పారిపోయింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాకు చెందిన మహిళ తమ కుమార్తె చదువు, వివాహానికి కావాల్సిన డబ్బు కోసం కిడ్నీ అమ్మాలని తన భర్తకు సూచించింది. అలా చేస్తే తమ కుటుంబానికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయని నమ్మించింది. పైగా, కిడ్నీ అమ్మాల్సిందేనంటూ భార్య పట్టుబట్టడంతో చేసేదేమీ లేక భర్త తన కిడ్నీని రూ.10 లక్షలకు విక్రయించింది. వచ్చిన డబ్బుతో తమ ఆర్థికస్థితి మెరుగుపడుతుందని ఆశించారు. 
 
కానీ, అతని ఆశలు గల్లంతయ్యాయి. ఆ వచ్చిన డబ్బుతో భార్య తన ప్రియుడుతో కలిసి పారిపోయింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడు రవిదాస్‌తో లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడకు చేరుకున్నారు. అయితే, తన భర్తతో మాట్లాడేందుకు ఆ మహిళ నిరాకరిస్తూ విడాకులు ఇస్తానని హెచ్చరించింద. పైగా, తన భార్య మాటలు నమ్మి తాను మోసపోయానని ఎలాగైనా తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు