భార్యకు పిల్లలు పుట్టలేదని చెప్పి.. యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (14:02 IST)
మిఠాయి దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతిని లొంగదీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పెళ్లైన వ్యక్తి. ఈ ఘటన బెంగళూరు నగరంలోని నీలాసాంధ్ర ప్రాంత పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్కేగార్డెన్‌కు చెందిన రవికుమార్ (36) ఓ మిఠాయి దుకాణంలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. 
 
తన భార్యకు సంతానం కలగలేదనే సెంటిమెంట్‌తో ఆమెకు విడాకులు ఇచ్చానని తనతో పాటు పనిచేస్తున్న 22 ఏళ్ల యువతితో చెప్పాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. చివరికి ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే రవికుమార్ తన భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్న బాధితురాలు మోసపోయిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రవికుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. బాధితురాలు 10 నెలల పాటు మిఠాయి దుకాణంలో పనిచేస్తుంది. మూడు నెలల క్రితం ఆమెను వివాహం చేసుకుంటానని బాధితురాలి తల్లిదండ్రుల వద్ద కూడా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు