శ్రుతి ఏప్రిల్‌లో అమరేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసి అనంతరం తన సోదరుడి ఇంట్లో ఉంటోంది. ఇటీవల, అమరేష్ మారిపోయానని చెప్పి ఆమెను తిరిగి తనతో కలిసి ఉండేలా ఒప్పించి తీసుకువెళ్లాడు. జులై 04వ తేదీన వారి ఇద్దరు కుమార్తెలు కళాశాలకు వెళ్లాక అమరేష్ పెప్పర్ స్ప్రే, కత్తితో తనపై దాడి చేశాడని శ్రుతి తన వాంగ్మూలంలో పేర్కొంది.
స్థానికుల సహాయంతో శ్రుతి ఆస్పత్రిలో చేర్చబడింది. ఆపై చికిత్స అందించడంతో డిశ్చార్జ్ అయ్యింది. అమరేష్ ఆటో డ్రైవరు కాగా, శ్రుతి పలు సీరియల్స్‌లో నటించింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.