పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రైతులు రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిని రైతులు దిగ్భందించారు. హరియాణా రోహ్తక్, కర్నాల్ ప్రాంతాల్లోనూ ట్రక్కు, ద్విచక్ర వాహనాలను నిలిపి రాకపోకలను రైతన్నలు అడ్డుకున్నారు.దక్షిణ భారతంలో తమిళనాడు, కేరళలో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కర్ణాటకలో మాత్రం బంద్ పాక్షికంగా సాగింది.
మరోవైపు రైతుల 'భారత్ బంద్' నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుధియానాకు చెందిన 65 ఏళ్ల వృద్ధ రైతు గత పది నెలలుగా గులాల్ టోల్ ప్లాజా వద్ద నిరసన చేస్తున్నాడు. అయితే 'భారత్ బంద్'కు కొన్ని గంటల ముందు ఆయన బలవన్మరణం చెందాడు. లుధియానాలోని నిరసన ప్రాంతానికి సమీపంలో మెడలో వేసుకున్ని కండువాతో ఒక పైప్‌కు ఉరి వేసుకున్నాడు.