కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని నిధులు కోరాయి. కొవాగ్జిన్‌ను తయారు చేస్తున్న హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూ.100 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.
అయితే, కొవిడ్ సురక్షా పథకం ద్వారానే ప్రభుత్వం నుంచి అటు భారత్ బయోటెక్, ఇటు సీరమ్ ఇన్స్టిట్యూట్ నిధులు కోరుతున్నాయి. ఈ పథకం కింద వ్యాక్సిన్ తయారీదారులకు నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ సెక్రటరీ రేణు స్వరూప్ చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధి, పరిశోధన కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతేడాది నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం దేశంలో సీరమ్‌కు చెందిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ను వాడుతున్నారు.