కాగా సూర్యుడి ఉపరితలంపై అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలు వచ్చి భూమి వాతావరణాన్ని తాకుతాయి. ఈ దృగ్విషయాన్నే సౌర తుఫానుగా పేర్కొంటారు. రాబోయే సౌర తుఫాను టెలికమ్యూనికేషన్లతో పాటు శాటిలైట్‌కు కూడా అంతరాయం కలిగించవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సౌర తుపానును భారత శాస్త్రవేత్తలు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. తగిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ భారత ఉపగ్రహ ఆపరేటర్లను ఇస్రో నిపుణులు ఇప్పటికే అప్రమత్తం చేశారు.
ఈ సౌర తుఫాను భూమిని తాకడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని తెలిపారు. ఇక భారత్‌పై ఈ తుఫాను ప్రభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చని అన్నారు. వేచి చూడాల్సి ఉంటుందని డాక్టర్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది మే నెలలో బలమైన సౌర తుఫాను భూమిని తాకిన విషయం తెలిసిందే.