ఇంధన ధరలతో పనిలేదు.. వినూత్న కారు రెడీ.. ఓ లెక్కల టీచర్? (Video)

శుక్రవారం, 22 జులై 2022 (22:47 IST)
Car
వాహనాలకు డిమాండ్ ఒక వైపు వున్నా... ఇంధన ధరలు పెరగడంతో వాహనాలు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇంధనం మాత్రమే కాకుండా ఉన్న వనరులపై కూడా ఆధారపడమని నిపుణులు చెప్తూనే వున్నారు. 
 
తాజాగా శ్రీ నగర్‌ నుంచి ఓ లెక్కల టీచర్‌ ఆ మాటని పాటించి చూపించారు. ఆయన ఇంధన అవసరం లేకుండా పని చేసే ఓ వినూత్న కారు తయారు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
 
ఇక టాలెంట్‌ని మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. "బిలాల్ అభిరుచి ప్రశంసనీయం. తను ఒక్కరే ఈ ప్రోటోటైప్ తయారుచేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే. 
 
ఈ డిజైన్‌కి మరింత ఫ్రెండ్లీ వెర్షన్ రావాలి. ఈ డిజైన్‌ మరింత అభివృద్ధి చేసేందుకు మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఆయనను కలుస్తారని @వేలు మహీంద్రాకు ట్యాగ్‌ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ కారును చూసిన నెటిజన్లు అతని ఐడియాని మెచ్చుకుంటున్నారు.

Bilal Ahmed, a mathematics teacher from Srinagar built a solar-powered car. His innovation is a step forward in the electronic vehicle market and a green mode of transport. @anandmahindra #solarcar #technology #sustainability #solarenergy pic.twitter.com/gXUGnE1THO

— The Better India (@thebetterindia) July 9, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు