రితోజ్ గ్రామానికి చెందిన సుఖి గురువారం తన స్నేహితుడితో కలిసి గురుగ్రామ సదర్ బజార్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణానికి వెళ్ళారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని తుటాల వర్షాలు కురిపించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుఖిని సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు.
కాగా ఖతానా బావమరిది చమన్ తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు ఖతానా కుమారుడు అనురాగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆర్ఆర్ఎస్ కార్యకర్త అయిన సుఖీ తాను హత్య కావడానికి కొన్ని గంటల ముందు తన ప్రొఫైల్ పిక్‌ను మార్చడం గమనార్హం. కాగా, హత్యకు పాల్పడినవారిలో పలువురిని పోలీసులు గుర్తించారు.