ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అశోక్ గస్తీ మృతి విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అయితే, గతరాత్రి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మనీష్ రాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అశోక్ గస్తీ రాత్రి 10.31 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు.
అశోక్ గస్తీ ఆసుపత్రిలో చేరినప్పుడు తీవ్ర న్యూమోనియాతో బాధపడుతున్నారని, అలాగే, ఆయన శరీరంలోని చాలా భాగాలు పనిచేయడం మానేశాయని పేర్కొన్నారు. ఐసీయూలో లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు.