వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తలకు వెలకట్టాడు. ఆమె తలను నరికి తెచ్చిన వ్యక్తికి రూ.11 లక్షల మేరకు రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నేత యోగేశ్ వర్షనీ సంచలన ప్రకటన చేశారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.
హనుమాన్‌జయంతి సందర్భంగా వెస్ట్ బెంగాల్‌లోని బీర్భమ్ జిల్లాలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ.. నిర్వాహకులు వినిపించుకోకుండా ర్యాలీలు నిర్వహించారు. ఘర్షణను అదుపుచేసేందుకు ర్యాలీలో పాల్గొన్న భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
దీనిపై యోగేష్ ఘాటుగానే స్పందించారు. సీఎం మమతాబెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం తల నరికి తీసుకొచ్చిన వారికి రూ.11లక్షల బహుమతి ఇస్తాను. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజుల్లో కూడా పూజలు చేసుకునేందుకు ఆమె అనుమతించట్లేదు. ఎదిరించి చేసుకుంటే వారిని తీవ్రంగా కొడుతున్నారు. ఆమె ముస్లింలకు మద్దతిస్తారు. ఇఫ్తార్ విందులు చేస్తారు’ అని యోగేశ్ వ్యాఖ్యలు చేశారు.