పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా రావడాన్ని సూపర్ మూన్‌గా పేర్కొంటారు. సాధారణ పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు సాధారణ పరిమాణం కంటే 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ తరహా బ్లూ మూన్ గతంలో 1940లో, ఆ తర్వాత 2018లో కనిపించింది. ఇప్పుడు మరలా కనిపించిన ఈ సూపర్ బ్లూమూన్ మళ్లీ 2037లో కనిపించనుంది.