ప్రముఖ నటుడు రిషి కపూర్, అనుపమ్ ఖేర్, వివేక్ ఒబెరాయ్, సోనూ సూద్‌తోపాటు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలంగాణ పోలీసుల చర్యకు మద్దతు పలికారు. బ్రేవో తెలంగాణ పోలీసు. మై కంగ్రాచ్యులేషన్స్ అని రిషి కపూర్ ట్వీట్ చేశారు.
వివేక్ ఒబెరాయ్ ట్వీట్ చేస్తూ దిశ హత్య కేసులో సత్వర న్యాయాన్ని అత్యంత శక్తివంతంగా ఇచ్చినందుకు తెలంగాణ పోలీసులను అభినందించారు.చట్టాన్ని ఉల్లంఘించి దాని వెనుక దాక్కునే రాక్షసులకు ఇదో బలమైన సందేశమని, అలాంటి రాక్షసులంతా భయంతో ఇప్పుడు గజగజ వణుకుతుంటారని వివేక్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే గాయకుడు, సంగీత దర్శకుడు విశాల్ దడ్లానీ మాత్రం తెలంగాణ పోలీసుల చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్య పట్ల తాను సంతోషంగా లేనని, దిశకు న్యాయం జరిగిందని ఎవరైనా భావిస్తే అది తప్పని ఆయన అన్నారు.