బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాలూ కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తను చెప్పినట్లు అవినీతి కేసుల నుంచి క్లీన్ ఇమేజితో వచ్చేందుకు ససేమిరా అనడంతో తనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఇంచార్జి గవర్నరుకు అందజేశారు. దీనితో ఆర్జేడీ-జేడీ మధ్య వివాదం మరింది ముదిరిపోయినట్లు అర్థమవుతుంది.
ఇంతకీ నితీష్ రాజీనామాకు కారణం ఏంటయా అంటే... అక్రమాస్తులు, అవినీతి కేసులను లాలూ ప్రసాద్‌తో సహా ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం అయిన తేజస్వి యాదవ్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో కేసులన్నీ ఎదుర్కొని, విచారణ పూర్తయ్యాక క్లీన్ ఇమేజితో రావాలనీ, అప్పటివరకూ పదవికి దూరంగా వుండాలనీ, రాజీనామా చేయాలని నితీష్ కోరారు. కానీ ఆయన మాటలను తేజస్వి యాదవ్ బేఖాతరు చేశారు. రాజీనామాకు ససేమిరా అన్నారు. దీనితో నితీష్ ఈ నిర్ణయం తీసుకున్నారు.