పెళ్లికి కొన్ని గంటలే.. ఇంతలో వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. ఎలా?

బుధవారం, 17 మే 2017 (11:16 IST)
పెళ్లికి కొన్ని గంటలే మిగిలి వున్నాయి. వరుడు డీసీఎంలో పెళ్ళి మండపానికి బయల్దేరాడు. కానీ ఇంతలోనే లారీ రూపంలో వరుడిని తీసుకెళ్లేందుకు యముడు వెంటనే వచ్చేశాడు. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో వరుడు కన్నుమూశాడు.

బుధవారం (నేటి) రాత్రి పెళ్లి జరగనుండడంతో మంగళవారం అర్థరాత్రి దాటాక పెళ్లి బృందం డీసీఎంలో ఖమ్మం బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది.
 
ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన వరుడు సహా కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని వధువు ఇంటికి డీసీఎంలో బయలుదేరారు. 
 
మార్గమధ్యంలో మోతె గ్రామం వద్ద ఓ పెట్రోలు బంకు సమీపంలో డీసీఎంను ఆపగా, వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు వెంకటశేషసాయి (21), దామోదర్ (35) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది గాయపడ్డారు. వీరిని కోదాడ ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి