ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బుద్ధుని బోధనలు పరిష్కారం చూపుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బుద్ధుడు చూపిన బాటలోనే భారతదేశం పయనిస్తుందన్నారు. అందులోభాగంగానే, అనేక దేశాలకు భారత్ సాయం చేస్తుందన్నారు.
ఇటీవల, టర్కీతో సహా భూకంప ప్రభావిత దేశాలకు భారతదేశం సహాయం చేసిందని గుర్తుచేశారు. భారతదేశం ప్రతి మనిషి బాధను తన సొంత బాధగా పరిగణిస్తుందని చెప్పారు. ప్రజలు, దేశాలు వారి స్వంత ప్రయోజనాలపై ఆసక్తి కలిగి ఉండాలని, ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
పేద, వనరులు లేని దేశాల గురించి ప్రపంచం ఆలోచించాలని కోరారు. బుద్ధుని ఆలోచనలను వ్యాప్తి చేయడంతోపాటు గుజరాత్‌తో పాటు తన సొంత నియోజకవర్గమైన వారణాసితో తనకున్న సంబంధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని చెప్పారు.
"సమకాలీన సవాళ్లకు పరిష్కారాలు: ఆచరణ దిశగా తత్వశాస్త్రం" అనే అంశంపై అంతర్జాతీయ బౌద్ధ సదస్సు గురు, శుక్రవారాల్లో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది.