దేశభక్తి గురించి గొంతు చించుకునే బీజేపీ.. దేశంలోని వనరులన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని, ఇదెక్కడి దేశభక్తి అని ప్రశ్నించారు. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సహా రైల్వేను కూడా అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, పేదల్ని మోసం చేసేలా ఉందని ఆరోపించారు.
అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు తప్పుబట్టారు. బడ్జెట్ ప్రకటనపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సహజమని అన్నారు. బడ్జెట్‌లో ప్రస్తావన లేనంత మాత్రాన మొండిచేయి చూపినట్టు కాదని స్పష్టం చేశారు.