నిజానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత జ్యోతిరాదిత్యం సింధియా మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో విభేదించి తన వర్గానికి చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిపోయారు. వీరింతా తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాగే, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెందడంతో.. మొత్తం 28 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీరిలో 12 మంది మంత్రులు ఉన్నారు.
అయితే ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయనేది ఉత్కంఠగా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 116. అయితే ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 9 స్థానాలు గెలవడం తప్పనిసరి. లేనిపక్షంలో అధికారం కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం భాతరతీయ జనతా పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 87 మంది సభ్యుల బలం ఉంది.