ఇదే అంశంపై ఆమె బీజేపీ సీనియర్ నేతల వద్ద స్పందిస్తూ... ఆరోగ్యపరంగా తాను వంద శాతం ఫిట్నెస్‌గా ఉన్నాను. కానీ, తనను అనారోగ్య కారణాల పేరుతో మంత్రివర్గం నుంచి తప్పించాలని చూస్తే మాత్రం సహించబోనని హెచ్చరించారు. తానైతే రాజీనామా చేయబోనని, కావాలంటే తనను డిస్మిస్ చేసుకోవాలని ఉమ తెగేసి చెప్పినట్టు సమాచారం.
అయితే తాను రాజీనామా చేసేది లేదని, తనను తొలగించాలనుకుంటే డిస్మిస్ చేయాలని అధిష్టానానికి ఉమ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. దీంతో ఉమా భారతి విషయంలో ఏం చేయాలనే విషయంలో అధిష్టానం సందిగ్ధంలో పడింది. పైగా, ప్రధాని మోడీపై తొలిసారి మహారాష్ట్రకు చెందిన ఓ బీజేపీ ఎంపీ ధిక్కార స్వరం వినిపించగా తాజాగా ఉమాభారతి ఇదే తరహా వైఖరిని అవలంభించడం గమనార్హం.