సినీ ఫక్కీలో అర్థరాత్రి పూట గ్యాంగ్ వార్.. హైవేపై కార్ల ఢీ.. కర్రలతో కొట్లాట..

సెల్వి

శనివారం, 25 మే 2024 (18:02 IST)
Dramatic Roadside Gangwar
సినీ ఫక్కీలో కర్ణాటకలో అర్థరాత్రి పూట గ్యాంగ్ వార్ జరిగింది. హైవేపై కార్లు, కర్రలతో రణరంగాన్ని తలపించారు. కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టుకున్నారు. అందులో ఉన్న కొందరు యువకులు బయటికి వచ్చి కర్రలతో ప్రత్యర్థులపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది. 
 
ఆ యువకులు చేసిన స్టంట్లు.. ఆ హైవే పక్కనే ఉన్న ఓ బిల్డింగ్‌పై నుంచి స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కర్ణాటకలోని ఉడుపిలో ఉడుపి - మణిపాల్ హైవేపై ఈ నెల 18 వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. 
 
ఈ సంఘటనను స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలను వదిలేయకూడదని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని.. మరో నలుగురి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

షాకింగ్ లైవ్ వీడియో

కర్ణాటకలో గ్యాంగ్ వార్

ఒకరినొకరు కారుతో ఢీకొట్టుకుంటూ, కత్తులతో దాడి చేసుకున్న ముఠాలు

ఉడిపి - మే 18న మణిపాల్ ప్రధాన రహదారి పై కారు విక్రయం విషయంలో 2 ముఠాల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఒకరినొకరు కారుతో గుద్దుకొని.. కత్తులతో దాడి చేసుకున్నారు.

నిందితులను… pic.twitter.com/fZsJu91k0v

— Telugu Scribe (@TeluguScribe) May 25, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు