ఇందులో 10,11 తరగతుల మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, 12వ తరగతిలో టెర్మ్ పరీక్షల నుంచి 40 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.ఈ విధానంతో సంతృప్తి చెందనివారు పరీక్షలకు హాజరుకావొచ్చని పేర్కొంది. కాగా జూలై 31లోపు సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.
సీబీఎస్ఈ 12వ తరగతి మార్కులు ఎలా లెక్కిస్తారంటే..?
పదో తరగతి మరియు పదకొండవ తరగతి మార్కులని ఐదు పేపర్లలో మంచి పేపర్స్‌ని మూడు తీసి.. ఆ మార్కులను ఫైనల్ చేస్తారు. అదే విధంగా 12 తరగతి విషయం లోకి వస్తే.. యూనిట్, టర్మ్, ప్రాక్టికల్స్ ఆధారంగా మార్కులని ఫైనల్ చేస్తారు.
ఆటోని జనరల్ ఆఫ్ ఇండియా జులై 31, 2021 నెల ఫలితాలు విడుదల చేస్తామని చెప్పింది. ఏ జీకే వేణుగోపాల్ సుప్రీం కోర్టు తో మోడరేషన్ కమిటీని ఏర్పాటు చేస్తామని.. 12 వ తరగతి విద్యార్థులకు రివార్డులని ఇవ్వడం ఉంటుందని చెప్పారు. 12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం మార్క్‌లను కలపనున్నట్లు బోర్డు తెలిపింది.
11వ తరగతి పర్ఫార్మెన్స్ ఆధారంగా 30 శాతం మార్క్‌లు అలానే పదవ తరగతి ఆధారంగా 30 మార్క్‌లు ఇవ్వనున్నట్లు బోర్డు చెప్పింది. అదే విద్యార్థులు క్వాలిఫయింగ్ మార్క్‌లు రాకపోతే.. వారిని కంపార్ట్‌మెంట్ క్యాటగిరీలో వుంచాలంది. మార్క్‌లతో సంతృప్తి చెందని వారు సీబీఎస్ఈ పరీక్షలను రాసుకోవచ్చు అని అటార్నీ జనరల్ చెప్పారు