ఈ పరీక్షలపై జూన్‌లో మరోసారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలు పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బోర్డు పరీక్షలపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం స్వయంగా అధికారులతో సమీక్షించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలతోపాటు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.