వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీకి చెందిన సోనూ గుప్తా(26) తన అత్తతో గొడవపడింది. అనంతరం బెడ్‌పై ఉన్న బట్టలన్నీ చిందరవందర చేసి అదే బెడ్‌పై నిద్రిస్తున్న తన కుమారుడు అన్షూను కూడా తీసుకుని మెట్లపై నుంచి విసిరేసింది. దీంతో ఆ బాలుడి ముఖం, తలకు గాయాలైనాయి. ఈ బాలుడు ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. సోనూగుప్తా భర్త నితిన్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా... ఆస్తి వ్యవహారాల్లో వచ్చిన తేడాలే ఈ దుశ్చర్యకు కారణమని తెలుస్తోంది. అత్తతో ఏర్పడిన గొడవే ఈ దురాగతానికి దారితీసిందని.. సహనం కోల్పోయిన కోడలు రెండేళ్ల బాలుడిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా గుప్తా షార్ట్ టెంపరని.. ఆమె మెడికల్ రిపోర్టును పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.