ఇక మాస్క్ ధరించనక్కర్లేదు.. కేంద్రం ఆదేశాలు

గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:40 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మాస్కులు ధరించనవసరం లేదని పేర్కొంది. అయితే, ఇక్కడో మెలికపెట్టింది. ద్విచక్రవాహనాలపై, సైకిళ్లపై ఒంటరిగా వెళ్లే వారు ఇకపై మాస్కులు ధరించనక్కర్లేదని పేర్కొంది. అలా వెళుతూ మాస్కులు ధరించని వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయొద్దని ఆదేశాలు జారీచేసింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య చాలా మేరకు తగ్గిపోయాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం చాలా అధికంగా ఉంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47 వేల పై చిలుకు పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 38 వేల కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 
 
నిజానికి గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా మాస్కులు విధిగా ధరించాలన్న నిబంధన అమలవుతోంది. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా మాస్కులు ధరించని వారి నుంచి పోలీసులు అపరాధం రుసుం వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి శాంతించడంతో మాస్కులు ధరించాలన్న నిబంధనను తొలగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు